పాత్రికేయుడిపై దాడి ఘటనలో కేసు నమోదు: జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్

కడప: పులివెందులలో ఓ జర్నలిస్టు కెమెరాను ధ్వంసం చేసిన ఘటనపై వెంటనే స్పందించి కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు.  ఆదివారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో.. జేసీ డా. నిధి మీనాతో కలిసి  
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడారు.  బాధిత పాత్రికేయుడికి వ్యక్తిగత భద్రత కల్పించామని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ దృశ్యాలను పరిశీలించి ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయుల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, మీడియా ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, మీడియా ప్రతినిధుల భద్రతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని 
ఈ సందర్భంగా పులివెందులలో పాత్రికేయుడిపై జరిగిన దాడి ఘటనపై వెంటనే కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.