నాలుగు గ్రామాల సర్పంచ్ గా రమాదేవి ఏకగ్రీవం.!
ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లె పంచాయితీలో పెద్దశెట్టిపల్లె, శంకరాపురం, నరసింహకొట్టాల, కొత్తపేట గ్రామాలు ఉన్నాయి. 4 గ్రామాల సర్పంచ్ గా టిడిపికి చెందిన రమాదేవి ఏకగ్రీవం అయ్యారు. వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవం అయ్యారు. వీరికి శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ ఫారం అందజేశారు.