ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ బ్లూఫిల్మ్ లాంటోడు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ బ్లూఫిల్మ్ లాంటోడని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎగ్జిబిషన్ బకాయి రూ.1.63 కోట్లు కట్టించకుండా మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఎక్కడికి వెళ్లినా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కమిషనర్ ఇక్కడినుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినా.. అక్కడ ఆయన ఇంటి వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. కమీషనర్ విశ్వనాథ్ పైకి సపూర్ణ రామాయణం.. లోపల బ్లూఫిలింలాంటి వాడన్నారు.
