రూమర్స్ వ్యాప్తి చేస్తే.. చర్యలు: డీఎస్పీ బాలస్వామి రెడ్డి

ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు డిఎస్పీ బాలస్వామి రెడ్డి హెచ్చరించారు.  అటువంటి వారిని ఉపేక్షించేది లేదని చట్టపరిదిలో చర్యలు ఉంటాయన్నారు. ఆయన  ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని పంచాయతీ ఎన్నికల కేంద్రాలను పరిశీలించారు.  అక్కడి బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో  రూమర్స్ నమ్మొద్దన్నారు.  గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు.