ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు: డీఎస్పీ బాలస్వామి రెడ్డి

ప్రొద్దుటూరులో ట్రాఫిక్ నియంత్రణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని డీఎస్పీ బాలస్వామి రెడ్డి ఆదేశించారు.  ఆయన శనివారం ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది విధులు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు.
అనంతరం ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించి, పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల అమలు, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై సూచనలు చేశారు. ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండి, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ N.భాస్కర్,  ఎస్సై, M.భాస్కర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.