ఎగ్జిబిషన్ బాకీ కమిషనరే కట్టాలి: టిడిపి నేత ప్రవీణ్

ప్రొద్దుటూరు: ఎగ్జిబిషన్ సామాను అంచనా విలువను ఏకంగా రూ.3కోట్లకు పెంచి తప్పుడు రిపోర్ట్ ఇవ్వాలంటూ మున్సిపల్ డీఈ రాజేష్ పై మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ ఒత్తిడి తెస్తున్నాడని టిడిపి నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. రూ.1.63 కోట్లు ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ బకాయి ఉన్నాడన్నారు. అక్కడ రూ.95 లక్షల సామాను మాత్రమే ఉందంటూ డీఈ రాజేష్ కమిషనర్ కు రిపోర్ట్ ఇచ్చాడన్నారు. బాకీకన్నా సామాను తక్కువ ఉండడంతో విలువ పెంచి రిపోర్ట్ తయారు చేయించి, CDMA వద్దకు తీసుకువెళ్లాలని కమిషనర్ ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. రూ.3 కోట్ల సామాను ఉంటే, కమిషనరే మున్సిపాలిటీకి రూ.1.63 కోట్లు కట్టి, సామాను అమ్ముకోవచ్చు కదా అని ప్రవీణ్ ప్రశ్నించారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.