కొత్తపల్లె సర్పంచ్ ఉమ ఏకగ్రీవం.!

ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ గా టిడిపికి చెందిన ఈనపాటి ఉమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ వైసీపీ మద్దతుదారుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.  దాంతో ఉమ ఏకగ్రీవం అయ్యారు.  శుక్రవారం సాయంత్రం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కొత్తపల్లె సర్పంచ్ గా ఉమ ఎన్నికైనట్లు డిక్లరేషన్ ఫారం అందజేశారు.  కార్యక్రమంలో టీడీపీ నేతలు సినీహాబ్ రాజేశ్వర రెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి సలహా కమిటీ అధ్యక్షుడు బద్వేల్ శ్రీనివాసుల రెడ్డి, టిడిపి నేతలు, అధికారులు పాల్గొన్నారు.