పర్లపాడు వైసీపీ అభ్యర్థుల అప్పీల్ రిజెక్ట్.!

రాజుపాలెం మండలం పర్లపాడు సర్పంచ్ స్థానానికి టీడీపీకి చెందిన తోట సాహితి, తోట లక్ష్మీ నరసమ్మ, వైసీపీకి చెందిన బుక్కపట్నం నందిని, బుక్కపట్నం ప్రవల్లిక నామినేషన్లు దాఖలు చేశారు.  ఎన్నికల రిటర్నింగ్ అధికారి వైసీపీకి చెందిన నందిని, ప్రవల్లిక నామినేషన్లను తిరస్కరించారు.  RO నిర్ణయంపై వారు జమ్మలమడుగు ఆర్డిఓ వద్ద అప్పీల్ చేశారు.  గురువారం ఆర్డీఓ విచారణ జరిపారు.  ఆర్ఓ నిర్ణయాన్ని సమర్థిస్తూ అభ్యర్థుల అప్పీల్ రిజెక్ట్ చేశారు.  దీంతో పర్లపాడులో టిడిపికి చెందిన అభ్యర్థి సర్పంచ్ గా ఏకగ్రీవం కానున్నారు.