బకాయిలపై ప్రశ్నించిన మున్సిపల్ చైర్మన్ రాఘవరెడ్డి.!

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్, ఎగ్జిబిషన్ బకాయిలపై మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఎగ్జిబిషన్ బకాయిలపై ప్రతిపక్షాల నుంచే కాకుండా, సొంత పార్టీ నేతల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి.  ఈ పరిస్థితుల్లో బకాయిలను ఎందుకు రాబట్టడం లేదని చైర్మన్ కమిషనర్ ను ప్రశ్నించారు.  వాటి పూర్తి వివరాలపై చైర్మన్ ఆరా తీశారు.  వేలంలో పాట పాడిన మొత్తాన్ని వసూలు చేయాల్సిందేనని చైర్మన్ అధికారులను ఆదేశించారు.  ఎగ్జిబిషన్ వ్యాపారులు కోర్టుకు వెళ్లారని తెలిపారు.  కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.