ప్రొద్దుటూరులో “ప్రజా ద్రోహ దినం” :రాచమల్లు
ప్రొద్దుటూరు: రేపు సోమవారం ప్రొద్దుటూరులో “ప్రజా ద్రోహ దినం” నిర్వహిస్తున్నట్లు స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆదివారం మీడియాకు తెలిపారు. ప్రజల ఓటుతో కాకుండా, కలెక్టర్చే నియమించబడిన మున్సిపల్ చైర్మన్, 52 మంది కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరగనున్న నేపథ్యంలో “ప్రజా ద్రోహ దినం”గా పరిగణిస్తున్నామన్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్న ఈ ప్రక్రియను నిరసిస్తూ రేపు మౌనంగా, శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాచమల్లు తెలిపారు.