ప్రొద్దుటూరు టిడిపి నేతలపై జనసేన మురళి ఫైర్.!

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కూటమి ధర్మాన్ని పాటించడం లేదని జనసేన పార్టీ స్థానిక ఎన్నికల సమన్వయకర్త మాదాసు మురళి ఫైర్ అయ్యారు.  ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని, కార్యకర్తలను అణగదొక్కే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.
జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో జనసేనకు సీట్లు కేటాయించారని,  ప్రొద్దుటూరులో మాత్రమే మున్సిపల్ వార్డుల్లో, కో-ఆప్షన్ సభ్యుల్లో అవకాశం ఇవ్వలేదన్నారు.  ప్రొద్దుటూరులో జరుగుతున్న పరిణామాలపై, టీడీపీ నేతల అణిచివేత వైఖరిపై జనసేన రాష్ట్ర కార్యాలయానికి నివేదిక పంపినట్లు తెలిపారు.  అల్లం చంద్రశేఖర్, కోనేటి పవన్, రాజేష్ పాల్గొన్నారు.