ఇక్కడ అన్ని పంచాయతీలకు నామినేషన్లు.!
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అన్ని పంచాయితీలకు TDP, YCP మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం 2వరోజున ప్రొద్దుటూరు మండలంలో సర్పంచ్ పదవులకు 37, వార్డు స్థానాలకు 186 నామినేషన్లు దాఖలయ్యాయని MDO సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం సర్పంచ్ స్థానాలకు గోపవరం-1, కొత్తపల్లి-2, సోములవారిపల్లె-4, పెద్దశెట్టిపల్లి-0, చౌటపల్లె-0, దొరసానిపల్లె-5, చౌడూరు-2, కాకిరేనిపల్లె-1 తాళ్ళమాపురం-2, కల్లూరు-1, నంగనూరిపల్లె-5, సీతంపల్లె-6, ఉప్పరపల్లె-5, కామనూరు-0, చెన్నంరాజుపల్లె-3 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం సర్పంచ్ 32, వార్డులకు 165 నామినేషన్లు వేశారు.
*రాజుపాలెం మండలంలో నేడు ఆదివారం సర్పంచ్-34, వార్డులకు-138 నామినేషన్లు దాఖలయ్యాయని MDO సురేష్ బాబు తెలిపారు. సర్పంచ్ స్థానాలకు రాజుపాలెం-3, వెంగళాయపల్లి-2, టంగుటూరు-3, గాదెగూడూరు-2, కొర్రపాడు-1, వెలవలి-7, వాసుదేవపురం-1, ఎరువాపాలెం-2, అరకటవేముల-3, పర్లపాడు-2, చిన్నశెట్టిపల్లి-2, కూలూరు-2, గోపాయపల్లి-3, కుమ్మరపల్లి-1 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం సర్పంచ్ 42, వార్డులకు 131 నామినేషన్లు వేశారు.