ఆరోగ్య కేంద్రాల తనిఖీ.!
ప్రొద్దుటూరులోని శ్రీరాములపేట పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం “స్టేట్ రివ్యూ మిషన్ ”టీం జాయింట్ డైరెక్టర్ డా. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఇ-ఔషది, ఇ హెచ్ ఆర్, హెచ్ యం ఐ యస్, వాక్సిన్, మెడిసిన్, వార్డులు, ల్యాబ్, బయో మెడికల్ వేస్టెజ్, వసతులు పరిశీలించారు. కేసుల వివరాలు, రిపోర్ట్స్, రికార్డ్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్స్ డా శిరీష, డా సౌజన్య లక్ష్మి, డి పి యం ఓ డా తాహ, యస్ ఓ రమేష్ రెడ్డి, ఎన్టిఇబిఏపిఓ రవీంద్ర కుమార్, వైద్యాధికారి డా భరత్ నారాయణ, డిపిఓ నారాయణ, రాజశేఖర్, కరీముల్లా, డిప్యూటి హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, టిబి సూపర్వైజర్ రాజారత్నం, డిఇఓ వినయ్, సిబ్బంది పాల్గొన్నారు.