ప్రొద్దుటూరు కమిషనర్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్:వైసీపీ నేత బంగారెడ్డి
ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ అవినీతిపై జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ జెసి, CDMA, మున్సిపల్ కమిషనర్ పై కోర్టులో కేసులు వేస్తున్నట్లు వైసీపీకి చెందిన ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ రూ.1.63 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఇందులో అందరికీ వాటాలు ఉండడంతో రికవరీ చేయడం లేదన్నారు. కాంట్రాక్టర్ డబ్బులు కడతామన్నా కమీషనర్ కట్టించుకోవడం లేదన్నారు. అవినీతి కమిషనర్ వల్ల మున్సిపల్ ఖజానాకు రూ.1.63 కోట్లు గండి పడిందన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.