అక్కడ ఉప సర్పంచ్ రాజకీయం.!

ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయితీలో ఉప సర్పంచ్ పదవి చుట్టూ రాజకీయం నడుస్తోంది.  టీడీపీకి చెందిన సినీహబ్ రాజేశ్వర రెడ్డి కుమారుడు వీరకుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి కుమారుడు హర్ష వర్షవర్ధన్ రెడ్డి ఉప సర్పంచ్ పదవి ఆశిస్తున్నారు.  వీరకుమార్ రెడ్డి వార్డు సభ్యునిగా ఏకగ్రీవం అయ్యారు.  హర్షవర్ధన్ రెడ్డికి గట్టి పోటీ పెట్టారు.  ఈ రాజకీయంలో భాగంగానే ఇక్కడి ఆరు వార్డుల్లో ఎన్నికలు జరిపిస్తున్నారని అంటున్నారు.  
*కొత్తపల్లె పంచాయతీలోని 20 వార్డుల్లో..  20 టీడీపీ, 17 వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.  రిటర్నింగ్ అధికారి వైసీపీకి చెందిన సర్పంచ్ మరియు 14 వార్డులకు చెందిన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు.  ఈ 14 మంది ఆర్డీఓ వద్ద అప్పీల్ చేయగా.. 11 మంది అభ్యర్థుల అప్పేళ్లను రిజెక్ట్ చేశారు.  ముగ్గురు అభ్యర్థులకు మాత్రం అనుమతించారు.  దాంతో కొత్తపల్లెలో ఆరు వార్డుల్లో పోటీ నెలకొంది.  ఇందులో తెరవెనుక రాజకీయం  నడిచిందంటున్నారు.