ఎగ్జిబిషన్ బకాయిలు రూ.2.74 కోట్లు.. వసూలు చేయరా.?

ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ల నుంచి సుమారు రూ.2.74 కోట్ల బకాయిలు పేరుకు పోయాయి.  ఈ ఏడాది ఎగ్జిబిషన్ కాంట్రాక్ట్ శివకుమార్ రూ.1.84(+18%GST) కోట్లకు దక్కించుకున్నాడు.  ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు కేవలం రూ.55 లక్షలు మాత్రమే వసూలు చేశారు. మిగతా మొత్తం 
 రూ.1.63 కోట్ల బకాయి అలానే ఉంది. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ రెవెన్యూ అధికారులు బకాయి వసూళ్లను పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్లు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. 2013 నుంచి 2026 వరకు వివిధ సంవత్సరాల్లో ఎగ్జిబిషన్ల నిర్వహణకు సంబంధించి కాంట్రాక్టర్లు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.2,74,53,000.00 ఉన్నాయి.
సంవత్సరంకాంట్రాక్టర్ పేరుబకాయి (రూ.లక్షల్లో)
2013రామాంజనేయులు6.51
2015చాంద్ బాషా3.96
2016గురు భాస్కర్ రెడ్డి3.13
2017సుధాకర్ రెడ్డి2.00
2018సుబ్బన్న4.75
2019మహేశ్వర రెడ్డి8.02
2021భాస్కర్7.10
2022బాలరామి రెడ్డి4.50
2023వెంకటరామి రెడ్డి5.66
2024చలపతి31.50
2025శివకుమార్34.40
2026శివకుమార్163.00
మొత్తం274.53
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమెందుకు?
మున్సిపాలిటీకి రావాల్సిన ఎగ్జిబిషన్ ఆదాయం సుమారు రూ.2.74 కోట్లకు పైగా బకాయిగా పేరుకుపోవడానికి కారణాలేమిటి? సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి బకాయిల వసూళ్లకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇంత భారీ మొత్తం పెండింగ్‌లో ఉన్నా ఎందుకు వసూలు చేయలేకపోతున్నారు? అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.  మున్సిపల్ ఆదాయానికి సంబంధించిన ఈ భారీ బకాయిలపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి తక్షణమే వసూలు చేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నారు.  మున్సిపల్ కమిషనర్లు బకాయిలు వసూలు చేయకుండా ఏమి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.  పేదలు రూ.100ల పన్ను కట్టకపోతే ఇంటి కొళాయి కట్ చేసే అధికారులు ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ల నుంచి రూ.కోట్ల బకాయిలను ఎందుకు వదిలేశారని ప్రజలు చర్చించుకుంటున్నారు.