మూడోతరం వారసురాలిగా ప్రజా సేవలోకి తోట సాహితి.!

రాజుపాలెం మండలం పర్లపాడు సర్పంచ్ గా ఎంబీఏ పూర్తి చేసిన తోట సాహితి ఏకగ్రీవం అయ్యారు.  సాహితీ తండ్రి తోట మహేశ్వర రెడ్డి జడ్పీటీసీగా, అబ్బ తోట జయరామి రెడ్డి సర్పంచ్ గా గతంలో పనిచేశారు.  ఆ కుటుంబం నుంచి మూడోతరం వారసురాలిగా సాహితీ ప్రజా సేవలోకి అడుగుపెట్టారు.  సర్పంచ్ గా ఏకగ్రీవం అయిన సాహితీని పలువురు అభినందించారు.