ప్రొద్దుటూరులో ప్రవేట్ ఆస్పత్రుల తనిఖీ.!
ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆస్పత్రులను బుధవారం DMHO యుగంధర్ తనిఖీ చేశారు. ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, ఫైర్ ఎక్విప్మెంట్, పారిశుద్ధ్యము, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ, అత్యవసర వైద్య సదుపాయాలు, సిబ్బంది అర్హత, మందుల నిల్వలు, రోగులకు అందిస్తున్న సేవలు, స్కానింగ్ యంత్రాల రికార్డులను తనిఖీ చేశారు.
అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించడం, రోగుల పట్ల నిర్లక్ష్యం వహించడం వంటి అంశాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆసుపత్రుల యాజమాన్యాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా గీత, డెమో భారతి, డిప్యూటి హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, పాలేశ్వరరావు పాల్గొన్నారు. ..