ఎగ్జిబిషన్ వివాదంపై అసోసియేషన్ నేతల విచారణ.!
ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ వివాదంపై అసోసియేషన్ నేతలు విచారణకు వచ్చారు. ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ మున్సిపాలిటీకి బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు ఎగ్జిబిషన్ లోపలి పరికరాలను సీజ్ చేశారు. మున్సిపల్ కమిషనర్, ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ వివాదములోకి స్టాల్స్, పరికరాల వ్యాపారులను లాగడంపై అసోసియేషన్ నేతలు స్పందించారు. వారు శుక్రవారం ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ సందర్శించారు. మున్సిపల్ అధికారులతో చర్చించారు. బకాయిలు కాంట్రాక్టర్ నుంచి రాబట్టుకోవాలని, వినోద పరికరాలను తీసుకువెళ్ళనివ్వాలని కోరారు.