రాచమల్లూ.. ఏకగ్రీవాలపై అంత అక్కసెందుకు.?: ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకుంటే మాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు అక్కసెందుకంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏకగ్రీవ ఎన్నికలపై జిల్లా కలెక్టర్ పై తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రజల నిర్ణయాలను రాజకీయాల్లోకి లాగడం తప్పన్నారు. నామినేషన్ల ప్రక్రియపై ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవపట్టించడం మంచిదికాదన్నారు. రాచమల్లు మాటలను ప్రజలు నమ్మరన్నారు.