కలెక్టర్ గారూ.. పోటీ ఉన్నచోటైనా ఎన్నికలు జరిపించండి: అభ్యర్థుల అభ్యర్థన

కడప జిల్లా కలెక్టర్ గారు.. అభ్యర్థులు పోటీ ఉన్నచోటైన ఎన్నికలు జరిపించండి అంటూ ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె గ్రామపంచాయతీకి చెందిన వైసీపీ అభ్యర్థులు గురువారం వీడియోద్వారా అభ్యర్థించారు. స్క్రూటినీలో ఆమోదం పొందిన తమ నామినేషన్లను ఫోర్జరీ సంతకాలతో రద్దు కాకుండా కాపాడాలని, ఎన్నికలు జరిపించాలని అభ్యర్థించారు. తమను పోటీ నుంచి ఉపసంహరణ చేసుకోవాలంటూ టిడిపి నేతలు, పోలీసులు బలవంతం చేస్తున్నారని తెలిపారు. వారికి భయపడి పరాయి రాష్ట్రానికి పోయి తలదాచుకుంటున్నామని తెలిపారు. తమ నామినేషన్ల పత్రాలకు రక్షణ కల్పించాలని వైసీపీకి చెందిన 10 వార్డుల అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.