రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన సాయిరమ్య.!
విశాఖపట్నం: రాజుపాలెం మండలం గోపాయపల్లెకు చెందిన దుద్దేల మాధవి సుబ్బిరెడ్డిల కుమార్తె సాయిరమ్య రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎండి రేడియో డయాగ్నోసిస్ పీజీ పరీక్షల్లో 611 మార్కులు సాధించారు. రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు. శ్రీకాకుళంలోని గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్లో ఎండి రేడియో డయాగ్నోసిస్ విద్యను అభ్యసించారు. ఆవిభాగంలో పీజీ చేసి రాష్ట్రస్థాయి యూనివర్సిటీ స్థాయిలో ద్వితీయ స్థానం నిలవడంపట్ల సాయి రమ్యను అధ్యాపక బృందం, గ్రామ ప్రజలు అభినందించారు. మార్గదర్శకత్వం వహించిన రేడియో డయాగ్నోసిస్ విభాగాదిపతి డాక్టర్ రూపేష్ మాండవ, అధ్యాపక బృందానికి విద్యార్థిని సాయి రమ్య కృతజ్ఞతలు తెలిపారు.