ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న కమిషనర్: టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాధ్ అక్రమాలు, అవినీతితో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాడని స్థానిక టిడిపి నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ వద్ద డబ్బులు తీసుకున్న కమిషనర్ మున్సిపల్ ఆదాయానికి రూ.1.63 కోట్లు నష్టం కలిగించాడని తెలిపారు. తమ పార్టీకి చెందిన MLA, మున్సిపల్ చైర్మన్, కూటమి నేతలు అందరూ ఎగ్జిబిషన్ అమౌంట్ కట్టించాలని చెప్తున్నా కమిషనర్ పట్టించుకోవడం లేదన్నారు. ఈ కమిషనర్ ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు తెస్తాడన్నారు. ప్రొద్దుటూరు నుంచి సాగనంపాలన్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.