ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి.!

ప్రొద్దుటూరు: "సురక్షిత మాతృత్వ అభియాన్” కార్యక్రమంలో భాగంగా సోమవారం కల్లూరు ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  జమ్మలమడుగు ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. గీత మాట్లాడుతూ..  ప్రతి గర్భిణీ స్త్రీ గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.  గ ర్భిణులకు రక్తహీనత, అధిక రక్తపోటు, మధుమేహం తదితర సమస్యలను ముందుగానే గుర్తించి తగిన వైద్య చికిత్స అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.  పౌష్టికాహారం తీసుకోవాలని, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలను వైద్యుల సూచనల మేరకు వాడాలన్నారు.  ప్రమాద సంకేతాలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని,  ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా. అర్చన, డి.హెచ్.ఇ.ఓ. వెంకటేశ్వర్లు, హెచ్.ఇ.ఓ. రాజశేఖర్, సూపర్‌వైజర్ విజయకుమారి మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.