ఆర్ఓలు తప్పులు చేస్తే.. తప్పించుకోలేరు: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు:మంగళవారం నామినేషన్ల పరిశీలనలో ఆర్ఓలు తప్పులు చేస్తే తప్పించుకోలేరని, వారిపై ఎన్నికల ట్రిబ్యునల్, హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు, పరిశీలనకు అభ్యర్థులు వెళ్లేందుకు హైకోర్టు నుంచి పోలీసు రక్షణను కోరామన్నారు. అధికార పార్టీ నేతలకు లొంగి, భయపడి వైసిపి మద్దతు దారులు నామినేషన్ల పత్రాలపై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చర్యలు చేపడతామని తెలిపారు. పోలీసులే తమ అభ్యర్థులను ఇంటి వద్ద నుంచి నామినేషన్ పరిశీలన కేంద్రాల వద్దకు సేఫ్టీగా తీసుకువెళ్లి తిరిగి ఇంటి వద్దకు చేర్చాలని మాజీ ఎమ్మెల్యే కోరారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.