చైర్మన్ చేజారింది.. వైస్ చైర్మన్ వరించింది.!

ప్రొద్దుటూరు:మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి టిడిపి పట్టణ అధ్యక్షుడు, 27వ వార్డు కౌన్సిలర్ చల్ల రాజగోపాల్ యాదవ్ ను వరించింది.  ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రాజగోపాల్ పేరు ప్రకటించారు.  మొదట్లో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రాజగోపాల్ పేరు తెరపైకి వచ్చింది.  చైర్మన్ పదవిని జనరల్ కు కేటాయించడంతో ఎమ్మెల్యే సోదరుడు నంద్యాల రాఘవరెడ్డిని ఎంపిక చేశారు.  చైర్మన్ పదవి చేజారడంతో, 
వైస్ చైర్మన్ పదవికి రాజగోపాల్ పేరే ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది.  వైస్ చైర్మన్ పదవికి పలువురు పోటీ పడినప్పటికీ, చివరికి రాజగోపాల్ నే పదవి వరించింది.  ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లతో పాటు పార్టీ నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు.  
*గతంలో YSRCPలోను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రాజగోపాల్ యాదవ్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ, అభ్యర్థి మార్పు జరిగింది.  ఇప్పుడు టిడిపిలో వైస్ చైర్మన్ అయ్యారు.