కామనూరు, చౌటపల్లె, కొర్రపాడులో రాజీ.. మిగతా చోట్ల పోటీ.?

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 30 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.  కొర్రపాడులో ఇరువర్గాల రాజీతో శ్రావణి ఒక్కరే సింగిల్ నామినేషన్ వేశారు.  కామనూరు, చౌటపల్లెలో కూడా ఇరువర్గాలు రాజీ అయ్యారు.  మిగతా 27 పంచాయితీల్లో పోటీ ఉంది.
*ప్రొద్దుటూరు మండలంలో 15 పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ పదవులకు 89, వార్డు స్థానాలకు 443 నామినేషన్లు దాఖలయ్యాయని MDO సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. గోపవరం-3, కొత్తపల్లి-5, సోములవారిపల్లె-10, పెద్దశెట్టిపల్లి-4, దొరసానిపల్లె-7, చౌడూరు-5, కాకిరేనిపల్లె-4, తాళ్ళమాపురం-8, కల్లూరు-7, నంగనూరిపల్లె-9, సీతంపల్లె-10, ఉప్పరపల్లె-8, చెన్నంరాజుపల్లె-5, చౌటపల్లె-2, కామనూరు-2 నామినేషన్లు దాఖలయ్యాయి.  
*రాజుపాలెం మండలంలో 15 పంచాయతీలకు సంబంధించి సర్పంచ్-99, వార్డులకు-341 నామినేషన్లు దాఖలయ్యాయని MDO సురేష్ బాబు తెలిపారు. సర్పంచ్ స్థానాలకు రాజుపాలెం-9, వెంగళాయపల్లి-4, టంగుటూరు-5, గాదెగూడూరు-4, వెలవలి-10, వాసుదేవపురం-4, ఎరువాపాలెం-7, అరకటవేముల-13, పర్లపాడు-5, చిన్నశెట్టిపల్లి-8, కూలూరు-4, గోపాయపల్లి-7, కుమ్మరపల్లి-9, కొర్రపాడు-1 నామినేషన్లు వచ్చాయి. కొర్రపాడులో ఇరువర్గాలు రాజీఅయ్యారు.
*మంగళవారం పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన జరగనుంది.  స్క్రూటినీకి వెళ్లడానికి రక్షణ కల్పించాలని ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలాల వైసీపీ అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.  పోలీసుల రక్షణతో స్క్రూటినీలో పాల్గొననున్నారు.