కృత్రిమ మేధతో బోధనలో నూతన ఆవిష్కరణలు:సీవీ రామన్ సైన్స్ క్లబ్ అధ్యక్షులు విజయ భాస్కర్

ప్రొద్దుటూరు:ప్రస్తుత టెక్ యుగంలో విద్యార్థులను పాఠాల వైపు ఆకర్షించాలంటే ఉపాధ్యాయులు కృత్రిమ మేధ (AI) టూల్స్‌ను ఉపయోగించాలని, కాలానికి తగినట్లు అప్‌డేట్ అవ్వాలని చాపాడు ఎంఈఓ వి.వంశీ కృష్ణ సూచించారు.​ఆదివారం ప్రొద్దుటూరు వైవీఎస్ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో 'సర్ సీవీ రామన్ సైన్స్ క్లబ్' ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ‘AI టూల్స్ - హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్’ పేరిట శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.  ​క్లబ్ అధ్యక్షులు, వైవీఎస్ హెచ్‌ఎం విజయ భాస్కర్ మాట్లాడుతూ.. బోధనలో వినూత్న అంశాలను సృష్టించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి AI ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  కడప ప్రభుత్వ పురుషుల కళాశాల లెక్చరర్లు డాక్టర్ పి.వి. కృష్ణారెడ్డి (బోటనీ), డాక్టర్ ఎం. గురుమోహన్ రెడ్డి (ఎకనామిక్స్) ఉపాధ్యాయులకు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. ChatGPT, Gamma AI, NotebookLM, Google Vids, MagicSchool AI, Diffit, Napkin AI, Prezi AI వంటి యాప్స్ ద్వారా పాఠ్యాంశాలు, వీడియోలు, లెసన్ ప్లాన్లను సులభంగా తయారు చేసుకునే విధానాన్ని నేర్పించారు.  ​అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు హాజరైన ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవాధ్యక్షులు గోపినాథరెడ్డి, సెక్రటరీ తిరుమల కొండు, హెచ్‌ఎం రేణుకదేవి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.