ప్రొద్దుటూరులో వైసిపి, టిడిపి వర్గీయుల రాళ్ల దాడి.. పోలీసుల లాఠీచార్జి.!
ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లెలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ, టిడిపి వర్గీయులు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎంవీఆర్ కుమారుడు మురళి మద్దతుతో వైసిపి అభ్యర్థులు, సినీహబ్ రాజేశ్వరి రెడ్డి మద్దతుతో టిడిపి అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేకలు వేసుకున్నారు. రాళ్ల దాడులు చేసుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేశారు. స్థానిక డిఎస్పి బాలస్వామి రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాల వారిని అక్కడి నుంచి చదరగొట్టారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.