రాచమల్లు.. నీ గురువుతో కలిసొచ్చినా భయపడేది లేదు: టిడిపి నేత ఉక్కు ప్రవీణ్

ప్రొద్దుటూరు: స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు నిన్న మీడియాతో టిడిపి నేత ఉక్కు ప్రవీణ్ MLA వరదరాజుల రెడ్డికి భయపడుతున్నాడంటూ ఆరోపించారు. దీనిపై నేడు టిడిపి నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టీ ఖండించారు. నీవు, నీ గురువు కలిసొచ్చినా భయపడేది లేదంటూ హెచ్చరించారు. ఎవరి హయాంలోనైనా సరే ఎగ్జిబిషన్ బకాయిలను రాబట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ నుంచి రావల్సిన రూ.2.63 కోట్లు కట్టించక పోతే.. సమయమిచ్చి తమ పార్టీకి చెందిన చైర్మన్ రాఘవరెడ్డిని కూడా ప్రశ్నిస్తానన్నారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.