ప్రొద్దుటూరు ఎంపీపీ, ఉప ఎంపీపీ టిడిపికే.!
ప్రొద్దుటూరు ఎంపీపీగా భారతి, ఉప ఎంపీపీగా సుబ్బరాయుడు ఎన్నికయ్యారు. గురువారం స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ, ఉప ఎంపీపీ, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. కార్యక్రమంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి సూర్యనారాయణ రెడ్డి, MLA వరదరాజుల రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాఘవరెడ్డి, షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్, ZPTC సభ్యుడు ప్రతాప్, AMC మాజీ ఇంచార్జి చైర్మన్ లక్ష్మణ్, MPTC సభ్యులు, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.