అద్దెలపై GST – రివర్స్ ఛార్జ్ మెకానిజం (RCM)పై అవగాహన: జాయింట్ కమిషనర్ సుమతి

ప్రొద్దుటూరు: అద్దెలపై వస్తు సేవల పన్ను (GST – Reverse Charge Mechanism) అమలుకు సంబంధించి అవగాహన సదస్సును రాష్ట్ర పన్నుల శాఖ, కడప డివిజన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రొద్దుటూరులో నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ శ్రీమతి జి. సుమతి గారు మాట్లాడుతూ, GST చట్టం ప్రకారం రివర్స్ ఛార్జ్ మెకానిజం (RCM) యొక్క ప్రాముఖ్యత, అద్దెలపై GST వర్తించే సందర్భాలు, పన్ను చెల్లించాల్సిన బాధ్యతలు, రిజిస్ట్రేషన్ అవసరాలు, రిటర్నులలో వివరాల నమోదు మరియు సంబంధిత నిబంధనల గురించి వివరించారు. ముఖ్యంగా అద్దె చెల్లింపులకు సంబంధించి అద్దెదారు మరియు అద్దెదారుని GST పరిధిలోని బాధ్యతలు, పన్ను చెల్లింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. GST చట్టం మరియు నిబంధనలపై పన్ను నిపుణులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, పన్ను చెల్లింపుదారులు చట్టబద్ధమైన నిబంధనలను పాటించి, సరైన సమయంలో పన్నులు చెల్లించాలని సూచించారు.
*అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ప్రొద్దటూరు II సర్కిల్ రాజనరసింహ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ప్రొద్దటూరు I సర్కిల్ జ్ఞానానందరెడ్డి, DCTO హనుమంతయ్య, ACTO సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.  ఆడిటర్స్ అసోసియేషన్ (A.P.T.P.C.A), E.C Member సుబ్బరాయుడు, వైస్ ప్రెసిడెంట్ అఫ్ కడప డిస్ట్రిక్ట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సాధు గోపాల కృష్ణ,  ఆడిటర్లు, స్టేట్ టాక్స్ ప్రాక్టీషనర్లు (STPs), చార్టర్డ్ అకౌంటెంట్లు (CAs) మరియు ఇతర పన్ను నిపుణులు పాల్గొన్నారు.