సామాను వేలం వేసినా బాకీ తీరదే.. ఎలా?

రూ.1.63 కోట్ల ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ స్కాంలో.. మున్సిపల్ అధికారులు పూర్తిగా ఇరుక్కుపోతున్నారు.  ఎగ్జిబిషన్ నుంచి సామాను తరలిపోగా మిగిలిన వాటి విలువ రూ.95 లక్షలు మాత్రమే ఉంటుందంటూ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు లెక్క కట్టారు.  మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఇంచార్జ్ ఎంఈ రాజేష్ ఆధ్వర్యంలోని టీం ఎగ్జిబిషన్లో మిగిలిన సామాను విలువను లెక్కించారు.  ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ శివకుమార్ రూ.1.63 కోట్లు మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉండగా.. ఎగ్జిబిషన్ సామాను విలువ కేవలం రూ.95 లక్షల మాత్రమే ఉంటుందని అంచనా వేశారు.  దీంతో ఎగ్జిబిషన్ సామాను వేలం వేసినా.. మున్సిపాలిటీకి ఇంకా బకాయి రావాల్సి ఉంటుంది.  దీంతో మున్సిపల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎస్టిమేషన్ అమౌంట్ పెంచాలని అధికారి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.