కమిషనర్, కాంట్రాక్టర్ లాలూచి.. మున్సిపల్ ఖజానాకు రూ.1.63 కోట్లు గండి: ప్రజా పక్షం పార్టీ అధ్యక్షులు పుత్త లక్ష్మిరెడ్డి
ప్రొద్దుటూరు మున్సిపల్ ఖజానా ఆదాయానికి గండి కొట్టిన మీపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ.. స్థానిక మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ కు ప్రజా పక్షం పార్టీ అధ్యక్షులు పుత్త లక్ష్మిరెడ్డి లేఖ రాశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అవినీతి, అక్రమాల మయంగా మారిందన్నారు. పూర్తి అమౌంట్ కట్టించుకోకుండానే ఎగ్జిబిషన్ నిర్వహణను కాంట్రాక్టర్ కు అప్పగించారన్నారు. కమిషనర్, కాంట్రాక్టర్ లాలూచీపడి రూ.1.63 కోట్లు మునిసిపాలిటీకి నష్టం కలిగించారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.