ప్రొద్దుటూరులో అన్నపై తమ్ముడి దాడి.. కేసు నమోదు.!
ప్రొద్దుటూరు మౌలానా అజాద్ వీధికి చెందిన చెన్నపట్నం హరూన్ రసీద్ పై తమ్ముడు మునాఫ్ దాడి చేసిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు స్థానిక 1టౌన్ సీఐ కొండారెడ్డి గురువారం తెలిపారు. ఈ నెల 9న మసీదులో ఈ ఘటన జరగ్గా, రషీద్ పిర్యాదు మేరకు ఎస్సై మైనుద్దీన్ నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రూ. లక్ష బాకీ, ఫ్రాడ్ డాక్యుమెంట్స్ విషయమై ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్నాయన్నారు.
*సీఐ కొండారెడ్డి వివరాల మేరకు..
ఫిర్యాది 09.11.2026 తేదీన మధ్యాహ్నం 1.30 సమయంలో సుందరాచార్య వీధిలోని అహలే హదీస్ మసీదులో నమాజు చదువుకుంటూ ఉండగా తన తమ్ముడు మునాఫ్ అకస్మాత్తుగా వచ్చి చొక్కా పట్టుకొని, డబ్బులు బాకీ ఉంటే నా ఇంటి వద్దకు రౌడీలను తీసుకుని వస్తావా అని చెప్పు తీసుకొని నా పైన దాడి చేసినాడు. అంతట చుట్టుపక్కల వారు వచ్చి మా తమ్ముడు మునాఫ్ బారి నుండి నన్ను విడిపించినారు. మా తమ్ముడు మునాఫ్ ఫిర్యాది దగ్గర గతము లో ఫిర్యాది దగ్గర లక్ష రూపాయలు డబ్బు తీసుకొని ఉండి, డబ్బులు చెల్లించకుండా ఉంటే డబ్బులు అడిగినందుకు అందరి ముందు ఫిర్యాదిని నా బూతులు తిట్టి కొట్టినట్లు, అంతే కాకుండా మునాఫ్ ఇతరులకు కొదవ పెట్టిన స్థలమునకు సంభందించిన ఫ్రాడ్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఫిర్యాదిని ఆ స్థలాన్ని కొనమని లేదంటే చంపుతానని బెదిరించినట్లు, రాబడిన ఫిర్యాదు మేరకు అధికారుల ఉత్తర్వుల మేరకు గురువారం ప్రొద్దుటూర్ 1 టౌన్ పోలీసు స్టేషన్ నందు SI మైనుద్దీన్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.