అప్కాస్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి.!

ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆనందబాబుకు వినతి పత్రం ఇస్తున్న యూనియన్ నేతలు 
ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అప్కాస్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని యూనియన్ నేతలు సత్యనారాయణ, రాఘవ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ మేరకు వారు శుక్రవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఆనందబాబుకు వినతి పత్రం సమర్పించారు.  జీఓ DSH15034/6/2026 ప్రకారం MNO, FNO ఇతర టెక్నీషియన్లు అందరికీ క్యాజిలీవ్ అమలు చేయాలని, కనీస వేతనం 42,000 వేలు ఇవ్వాలని, పర్మినెంట్ చేయాలని కోరారు.  ఆప్కాస్ యూనియన్ నాయకులు నాగరాజు, మణిపాల్, శివకుమార్, డివైఎఫ్ఐ కార్యదర్శి విశ్వనాధ, ఆప్కాస్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.