సర్పంచ్ ఎన్నికలనైనా సక్రమంగా జరిపించాలి: కమ్యూనిస్ట్ నేతలు
ప్రొద్దుటూరు: మున్సిపల్, పరిషత్ ఎన్నికల మాదిరి కాకుండా.. సర్పంచ్ ఎన్నికలనైనా ప్రజాస్వామ్య బద్దంగా జరిపించాలని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నేతలు ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో గురువారం ప్రొద్దుటూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ ఉదయభాస్కరరాజుకు వినతి పత్రం సమర్పించారు.
*ఈ సందర్భంగా CPi జిల్లా కార్యవర్గ వర్గ సభ్యులు రామయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఓటు చోరికి పాల్పడితే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజలు తమ ఓటు హక్కును చేసిందన్నారు. ఎలక్షన్ యంత్రాంగం, పోలీసులు, అధికారులను లోబర్చుకుని చంద్రబాబు తన గుండాలతో దౌర్జన్యకాండకు పాల్పడ్డారన్నారు. తిరిగి ఫ్యాక్షన్ బీజాలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజాస్వామ్యనికి ఈ విధానాలు అత్యంత ప్రమాదకరమన్నారు. రానున్న సర్పంచ్ ఎన్నికలైనా సజావుగా జరపాలని లేని పక్షంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజా ఉద్యమం ద్వారా కూలుస్తామని వారు హెచ్చరించారు.
*సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి సత్యం మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లలో ప్రజాపాలన అటకెక్కిందన్నారు. సూపర్ 7 పథకాలు అమలు చేయలేదన్నారు. ఓట్లు రావనే భయంతో దుచ్చర్యలకు పాల్పడ్డారన్నారు.
*ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ పట్టణ సమితి సభ్యులు శివారెడ్డి, మచ్చా శ్రీను, నరసింహ, రామచంద్రారెడ్డి, భాస్కర్, సీపీఐ (ఎం) పట్టణ సమితి సభ్యులు విజయకుమార్, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.