ఉద్యోగాల పేరుతో మోసం.. ప్రొద్దుటూరులో విచారణ.!
ప్రొద్దుటూరు: కడప జిల్లా వనిపెంట ఫారెస్ట్ బీట్ అపీసర్ సురేఖ దంపతులు ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారని బాధితులు అధికారులకు పిర్యాదు చేశారు. జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లో బాధితుల పిర్యాదుతో FIR నమోదైంది. మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. దీంతో తాజాగా బుధవారం ప్రొద్దుటూరు ఫారెస్ట్ కార్యాలయంలో కడప సబ్ DFO వివేకానంద విచారణ నిర్వహించారు.
*వనిపెంట FBO సురేఖ దంపతులు జమ్మలమడుగు మండలం గొరిగనూరుకు చెందిన కొర్రపాటి లక్ష్మీ ప్రసన్న నుంచి రూ.6 లక్షలు తీసుకొని పెద్ద పసుపుల కస్తూరిబా పాఠశాలలో రెండు నెలలు పాటు కౌన్సిలర్ కెరియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగంలో నియామకం చేశారు. తర్వాత నకిలీ అపాయింట్మెంట్ అని ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించారు.
*గొరిగనూరుకు చెందిన రంగనాయకులును తొండూరు జూనియర్ కళాశాలలో ఒకటిన్నర నెలపాటు కౌన్సిలర్ కెరియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగంలో నియామకం చేశారు. తర్వాత ఇతన్ని కూడా నకిలీ అపాయింట్మెంట్ అని ఉద్యోగంలో నుంచి తొలగించారు. మరికొంత మందిని కూడా ఈ విధంగా మోసం చేశారనే ఆరోపణలు వచ్చాయి.
*వీటిపై బుధవారం ప్రొద్దుటూరు ఫారెస్ట్ కార్యాలయంలో కడప సబ్ DFO వివేకానంద బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు.