"మున్సిపల్, పరిషత్ స్థానాలు క్లీన్ స్వీప్ చేశాం" సీఎంకు వివరించిన ఎమ్మెల్యే
వెలగపూడి: సీఎం చంద్రబాబును ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఇటివల సీఎం, డిప్యూటీ సీఎం ప్రొద్దుటూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రకటించిన హామీలు, అభివృద్ధి పనుల ప్రగతిని సిఎంకు ఎమ్మెల్యే వివరించారు. మున్సిపల్ మార్కెట్ నిర్మాణం, ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ ఏర్పాటు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ భవనాల అభివృద్ధి, సీసీ రోడ్డు డ్రైన్ల నిర్మాణాలపై వివరాలను ఎమ్మెల్యే సీఎంకు సమర్పించారు.
*ఈ సందర్భంగా ప్రొద్దుటూరులోని తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వార్డులు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలను కూటమి క్లీన్ స్వీప్ చేసిన విషయాన్ని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సీఎం చంద్రబాబుకు వివరించారు.