ఎగ్జిబిషన్ బకాయిల వసూలు బాధ్యత కమిషనర్‌దే: పుత్తా లక్ష్మిరెడ్డి
ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ బకాయిల వసూలు బాధ్యత కమిషనర్‌దేనని ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ఎగ్జిబిషన్ కాంట్రాక్టర్ శివకుమార్ రూ.2.18 కోట్లు మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రూ.55 లక్షలు మాత్రమే వసూలైందన్నారు. ఎగ్జిబిషన్ వేలం రోజున 5 రోజుల్లో వసూలు చేస్తామని చెప్పిన కమిషనర్ విశ్వనాథ్ ఇప్పటివరకు ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ కు పిర్యాదు చేసినట్లు పుత్తా లక్ష్మిరెడ్డి తెలిపారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.