"ప్లాట్లు కొని మోసపోయాం" : ప్రొద్దుటూరులో బాధితుల గగ్గోలు

ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయితీ మండి బజారు రోడ్డులోని హరి విలాస్ వెంచర్లో ప్లాట్లు కొన్న బాధితులు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. డెవలపర్స్ బద్వేలు ప్రభాకర్ రెడ్డి, కల్లూరు ప్రభాకర్ రెడ్డి, కల్పలత మురళీ, ఇంజనీర్ జగదీష్ తమను మోసం చేసి ప్లాట్లు విక్రయించి.. బెదిరిస్తున్నారని తెలిపారు. అన్ని సదుపాయాలు కల్పిస్తామని నమ్మించి తమకు ప్లాట్లు విక్రయించారన్నారు. తర్వాత అభివృద్ధిని పట్టించుకోకపోగా, ఇప్పుడు దారి కోసం తమను బెదిరిస్తున్నారని వాపోయారు. ఘోరంగా, నీచంగా మాట్లాడుతున్నారని, బెదిరిస్తున్నారని తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. PGRSలో పిర్యాదు కూడా చేశామన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.