ప్రమాద రహితంగా దీపావళి జరుపుకోవాలి: డీఎస్పీ బాలస్వామి రెడ్డి

ప్రొద్దుటూరు: దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రొద్దుటూరు ప్రజలకు స్థానిక డిఎస్పి బాలస్వామి రెడ్డి శనివారం శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రమాద రహితంగా, సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. పిల్లలు క్రాకర్స్ కాల్చేటప్పుడు పెద్దలు దగ్గర ఉండి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. *ప్రొద్దుటూరులోని టపాసుల దుకాణాలను శనివారం స్థానిక జిల్లా సహాయ ఫైర్ ఆఫీసర్ బసివిరెడ్డి పరిశీలించారు. అగ్ని ప్రమాద నివారణ పరికరాల ఏర్పాటును తనిఖీ చేశారు. అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై డెమో నిర్వహించారు. నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.