ఆ కుటుంబానికి ఎన్ని పదవులంటే.?

జమ్మలమడుగు: దేవగుడి సోదరుల్లో ఒకరైన ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్నారు.  ఆయన సోదరుడు నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ జిల్లా టిడిపి అధ్యక్షుడుగా ఉన్నారు.  భూపేష్ సతీమణి జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.  ఆదినారాయణరెడ్డి మరో సోదరుడు గోపాల్ రెడ్డి కుమారుడు రాజేష్ జమ్మలమడుగు జడ్పీటీసీగా ఏకగ్రీవం అయ్యారు.  మరో సోదరుని కుమారుడు గోవర్ధన్ ముద్దనూరు జడ్పీటీసీగా ఎన్నికయ్యారు.  ఇప్పుడు జెడ్పీ ఛైర్మన్ పదవి రాజేష్ కు ఖరారైనట్లు సమాచారం.  
దేవగుడి కుటుంబంలో ఇప్పటికే ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, ఇద్దరు జెడ్పీటీసీలు, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు.