ఆ భూములపై విచారణ జరపాలి: పుత్తా లక్ష్మిరెడ్డి

అగ్రిగోల్డ్ పేరుతో ప్రజల నుంచి సేకరించిన డబ్బులను వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని, భూములు కొన్నారని వాటిపై విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి బుధవారం మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  అగ్రిగోల్డ్ చైర్మన్ సీతారామారావు డైరెక్టర్ గా ఉన్న క్రిస్టల్ సంస్థకు చెందిన కడప జిల్లాలోని భూములను కరూర్ వైశ్యా బ్యాంకులో పెట్టారన్నారు.  బ్యాంకు అధికారులు, రాజకీయ నాయకులు ద్వారా వాటిని  RK INFRA సంస్థ తక్కువ ధరకు పొందిందన్నారు.  ఆ భూముల వ్యవహారంపై బ్యాంకు ఉన్నతాధికారులు, ప్రభుత్వం విచారణ చేపట్టాలన్నారు.  అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు.