పులివెందులలో జాతీయ మీడియాపై దాడులు.!

పులివెందుల: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వంత నియోజకవర్గం పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.  పులివెందుల ఎన్నికల కవరేజీకి  ఇండియా టుడే, ఎన్టీవీ తదితర జాతీయ మీడియా సంస్థల విలేకర్లు వచ్చారు.  వారిపై దాడులు జరిగాయి.  కెమెరాలు ధ్వంసం చేశారు.  
ఎన్టీవీ రిపోర్టర్‌ సురేష్‌, ఇండియాటుడే టీవీ రిపోర్టర్‌ బషీర్‌, కెమెరామెన్‌ విజయ్‌, సాక్షి టీవీ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఇస్మాయిల్‌ ను   వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పరామర్శించారు.