అంగన్వాడీల చలో ఢిల్లీ.. విజయవంతం చేయాలి.!

చలో ఢిల్లీ కరపత్రాలు విడుదల చేస్తున్న సిఐటియు నాయకులు
ప్రొద్దుటూరు: అంగన్వాడి కార్యకర్తల సమస్యలపై డిసెంబర్ 1న ఢిల్లీలో ధర్నా చేపట్టినట్లు సిఐటియు నాయకులు సత్యనారాయణ, విజయకుమార్ తెలిపారు.  వారు శుక్రవారం పొద్దుటూరు ఐసిడిఎస్ సిడిపిఓ కార్యాలయం వద్ద చలో ఢిల్లీ కరపత్రాలను విడుదల చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిసెంబర్ ఒకటో తారీకున ఢిల్లీలో జరిగే ధర్నా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.  అంగన్వాడీ కార్యకర్తలు అందరూ ఢిల్లీ ధర్నాకు రావాలన్నారు.  అందుకు టికెట్లు రిజర్వేషన్లు చేయించుకోవాలని సూచించారు.  ప్రతి కార్మికునికి రూ.42,000 వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.  కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాఘవేంద్ర, అంగన్వాడి యూనియన్ నాయకులు సుబ్బలక్షమ్మ, సుబ్బలక్ష్మి, గీతమ్మ, రాణి, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.