వారికి ఎన్నికల విధులు కేటాయించొద్దు: APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి

కడప కలెక్టరేట్ ఏవోకు వినతి పత్రం ఇస్తున్న ఏపీటీఎఫ్ నాయకులు
కడప: వయస్సు పైబడిన, అనారోగ్య సమస్యలున్న, వికలాంగ ఉద్యోగ, ఉపాధ్యాయులను పంచాయతీ ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని APTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.  ఈ మేరకు ఆయన మంగళవారం కడప జిల్లా కలెక్టరేట్ పరిపాలనాధికారి నాగేశ్వరరావును కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా శ్యామసుందరరెడ్డి మాట్లాడుతూ.. 58 సంవత్సరాల పైబడిన వారికి ఎన్నికల విధులనుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.  దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, డయాలసిస్, లివర్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న వారికి, స్పాండిలైటిస్ తదితర వ్యాధులతో బాధపడుతున్న వారికి మినహాయింపు ఇవ్వాలన్నారు.  ప్రెగ్నెంట్ మహిళలు, లాక్టేటింగ్ మదర్స్ కు మినహాయింపు ఇవ్వాలన్నారు.  50% అంగవైకల్యం కలిగిన దివ్యాంగ ఉద్యోగులను ఎన్నికల విధులకు పంపొద్దన్నారు.
మహిళా ఉద్యోగులకు సమీప ప్రాంతాల్లోనే ఎన్నికల విధులను కేటాయించాలన్నారు.  ఎన్నికల అనంతరం రిసీవింగ్ సెంటర్స్ వద్ద ఆలస్యం అవుతున్నందున ఎన్నికల తరువాత రోజును కూడా ఆన్ డ్యూటీ గా పరిగణించాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి పోలింగ్ కేంద్రాల వద్ద, డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ కేంద్రాల వద్ద సరైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని కోరారు.
*ఈ కార్యక్రమంలో ఏపీ టిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు ఖాదర్ బాషా, శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్సులు గురయ్య, రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, మణికుమార్, క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.