6 పంచాయతీల్లోనే వార్డు ఎన్నికలు.!
ప్రొద్దుటూరు మండలంలో 15 పంచాయతీల్లో 182 వార్డులు ఉండగా.. 12 పంచాయతీల్లోని 139 యార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 6 పంచాయితీల్లోని 43 వార్డులకు 102 మంది పోటీలో ఉన్నారు.
*చెన్నంరాజుపల్లెలో 10, చౌడురులో 10, చౌటపల్లెలో 8, దొరసానిపల్లెలో 12, గోపవరంలో 20, కాకిరేనిపల్లెలో 8 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కల్లూరులో 8, కామనూరులో 10, కొత్తపల్లెలో 14, పెద్దసెట్టిపల్లెలో 14, సీతంపల్లెలో 5, సోములవారిపల్లెలో 20 వార్డులకు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.
*కల్లూరులో 2, నంగనూరిపల్లెలో 10, సీతంపల్లెలో 3, తాళ్ళమాపురంలో 12, ఉప్పరపల్లెలో 10 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 43 వార్డుల్లో 102 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.