కొత్తపల్లె 2సర్పంచ్, 11వార్డుల అప్పీళ్ల తిరస్కరణ.!
ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లెకు చెందిన వైసీపీ మద్దతుదారులు తమ నామినేషన్ల తిరస్కరణపై జమ్మలమడుగు ఆర్డీఓ వద్ద అప్పీల్ చేశారు. వీటిపై గురువారం అర్ధరాత్రి వరకు విచారణ జరిగింది. 2 సర్పంచ్, 11 వార్డుల అప్పీళ్లను ఆర్డీఓ రిజెక్ట్ చేశారు. 3 వార్డుల అప్పీళ్లను ఆమోదించారు. కొత్తపల్లె పంచాయతీలో సర్పంచ్, 20 వార్డులున్నాయి. టీడీపీ మద్దతుదారులు అన్ని స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ మద్దతు దారులు సర్పంచ్, 17 వార్డులకు నామినేషన్లు వేశారు. స్క్రూటినీలో రిటర్నింగ్ అధికారి వైసీపీ మద్దతుదారులకు చెందిన ఇద్దరు సర్పంచ్, 14 వార్డుల అభ్యర్థుల నామినేషన్లను చెల్లనివిగా ప్రకటించారు. దీనిపై అభ్యర్థులు జమ్మలమడుగు ఆర్డిఓ వద్ద అప్పీల్ చేశారు. వీటిపై గత అర్ధరాత్రి వరకు పరిశీలన, విచారణ జరిగింది. చివరికి 3 వార్డుల నామినేషన్లను మాత్రమే ఆమోదించారు. 2 సర్పంచ్, 11 వార్డుల నామినేషన్లను రిజెక్ట్ చేశారు. దీంతో కొత్తపల్లెలో 6 వార్డుల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. అక్కడ మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.