రూ.1.63 కోట్ల ఎగ్జిబిషన్ స్కాంలో.. కొత్త ట్విస్ట్.!

ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్ సామాన్లను తరలిస్తుండగా ఆదివారం మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. కాంట్రాక్టర్ శివకుమార్ రూ.1.85(+18% GST) కోట్లకు ఎగ్తీజిబిషన్ తీసుకున్నారు. పూర్తి అమౌంట్ చెల్లించాకే ఎగ్జిబిషన్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాల్సిన మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అప్పగించారు. కాంట్రాక్టర్ కేవలం రూ.55 లక్షలు మాత్రమే చెల్లించి, మిగతా రూ.1.63 కోట్లు ఎగవేశాడు. దీనిపై స్పెషల్ ఆఫీసర్ జేసీ, జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఆర్డీ, CDMA అధికారులు సీరియస్ అయ్యారు. శనివారం ఆర్డీ నాగరాజు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ ను అనంతపురం పిలిపించుకొని ఎగ్జిబిషన్ బకాయిలపై వివరణ కోరారు. ఆదివారం కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, మున్సిసిపల్ సిబ్బంది, పోలీసులతో ఎగ్జిబిషన్ వద్దకు వెళ్లి సామాను తరలింపును అడ్డుకున్నారు. ఇందుకు కాంట్రాక్టర్ శివకుమార్, రామాపురం గురివిరెడ్డి అభ్యంతరం తెలిపారు. *ముందుగా పూర్తి అమౌంట్ కట్టించుకోకుండా, బ్యాంక్ గ్యారంటీ తీసుకోకుండా.. రూ.1.63 కోట్లు మున్సిపల్ ఖజానాకు గండి పడేదాక అధికారులు ఏమి చేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాంట్రాక్టర్ కట్టకపోతే అధికారుల నుంచి వసూలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రొద్దుటూరు వార్తలు | PRODDATURNEWS.COM | Proddatur | YSR Kadapa District | Andhra Pradesh | Local News.